లాక్ డౌన్ నుంచి రైతులకు మినహాయింపు

ABN , First Publish Date - 2020-03-28T19:51:43+05:30 IST

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడంతో...

లాక్ డౌన్ నుంచి రైతులకు మినహాయింపు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడంతో అత్యవసర సేవలు తప్ప మిగతా సేవలన్నీ రద్దయ్యాయి. ఈ క్రమంలో వ్యవసాయం, వ్యవసాయాధారిత సేవలను కూడా అత్యవసర సేవల్లో చేరుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంటే 21 రోజుల లాక్ డౌన్ తో సంబంధం లేకుండా రైతులు వ్యవసాయం చేసుకోవచ్చు. హోల్ సేల్ బయ్యర్లు, కాంట్రాక్టర్లు, ఎరువులు అమ్మేవాళ్ళు, పురుగుల మందు దుకాణాలు, విత్తన దుకాణాలు వంటి వ్యవసాయ సంబంధిత సేవలన్నింటికీ.. లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది

Updated Date - 2020-03-28T19:51:43+05:30 IST