మూడు రోజుల పాటు రైల్ రోకోకు పిలుపునిచ్చిన పంజాబ్ రైతులు

ABN , First Publish Date - 2020-09-18T16:57:35+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగ బిల్లు పంజాబ్ లో చిచ్చు రేపుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రానికి చెందిన రైతులు కేంద్ర

మూడు రోజుల పాటు రైల్ రోకోకు పిలుపునిచ్చిన పంజాబ్ రైతులు

పంజాబ్ : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగ బిల్లు పంజాబ్ లో చిచ్చు రేపుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రానికి చెందిన రైతులు కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పక్క రాష్ట్రమైన హర్యానాలో కూడా రైతులు రోడ్డెక్కారు. దీన్ని ముందే పసిగట్టిన అకాలీదళ్.... కేంద్ర మంత్రివర్గం నుంచి బయటికొచ్చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మూడు రోజుల పాటు ‘రైల్ రోకో’ కు పంజాబ్ రైతులు పిలుపునిచ్చారు.


ఈ నెల 24 నుంచి 26 తేదీ వరకు రైల్ రోకో నిర్వహిస్తామని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. ‘‘కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ 24,25,26 తేదీల్లో రైల్ రోకోకు పిలుపునిచ్చాం’’ అని కిసాన్ మజ్దూర్ సంఘర్షఖ కమిటీ ప్రధాన కార్యదర్శి సరవన్ సింగ్ ప్రకటించారు. ఇతరులు కూడా వ్యవసాయ చట్టాల సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. 

Updated Date - 2020-09-18T16:57:35+05:30 IST