చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. ఓకే చెప్పిన రైతులు
ABN , First Publish Date - 2020-12-29T03:07:31+05:30 IST
వ్యవసాయ చట్టాలపై చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం నుంచి అందిన ఆహ్వానాన్ని రైతు సంఘాలు అంగీకరించాయి. ఈ నెల 30న

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం నుంచి అందిన ఆహ్వానాన్ని రైతు సంఘాలు అంగీకరించాయి. ఈ నెల 30న చర్చించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. కేంద్రం సూచించిన రోజున చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్టు 40 సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు అభిమన్యు కోహర్ పేర్కొన్నారు. ఈ నెల 30న జరగనున్న చర్చల్లో తాము కూడా పాల్గొంటున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సత్నామ్ సింగ్ సహాని తెలిపారు. అయితే, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని, అది జరగకుంటే ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు హెచ్చరించాయి.