ప్రభుత్వ భోజనం వద్దన్న రైతు నేతలు.. నేలపై కూర్చుని సొంత బాక్సుల్లో..!

ABN , First Publish Date - 2020-12-04T01:04:47+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలతో కేంద్రం ఇవాళ జరిపిన చర్చల సందర్భంగా ఆసక్తికర..

ప్రభుత్వ భోజనం వద్దన్న రైతు నేతలు.. నేలపై కూర్చుని సొంత బాక్సుల్లో..!

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలతో కేంద్రం ఇవాళ జరిపిన చర్చల సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన లంచ్‌ను రైతు నేతలు తిరస్కరించారు. ప్రముఖ రైతునేత గుర్నామ్ సింగ్ చౌదుని సహా అందరూ ప్రభుత్వ భోజనానికి బదులు తమ వెంట తెచ్చుకున్న లంచ్ బాక్సులను అందరూ పంచుకుని తిన్నారు. ‘‘ప్రభుత్వం ఇచ్చిన భోజనం, టీలను మేము స్వీకరించడంలేదు. మా భోజనాన్ని మేమే తెచ్చుకున్నాం...’’ అని రైతు నేతలు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రైతు నేతలు తమ బాక్సులను తెరిచి నేలపై కూర్చుని భోజనం చేస్తున్న ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రైతుల, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలు ఇవాళ నాలుగోరోజుకు చేరుకున్నాయి. 

Updated Date - 2020-12-04T01:04:47+05:30 IST