రైతు సంఘాలతో అసంపూర్తిగా ముగిసిన చర్చలు

ABN , First Publish Date - 2020-12-04T01:53:32+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలతో కేంద్రం ఈరోజు చర్చలు జరిపింది.

రైతు సంఘాలతో  అసంపూర్తిగా ముగిసిన చర్చలు

ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలతో కేంద్రం ఈరోజు చర్చలు జరిపింది. అయితే ఈచర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఈ సందర్భంగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రంపై రైతు సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చాయి. మీడియాలో వచ్చిన కథనాలను  రైతు సంఘాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి.  ప్రైవేటు మార్కెట్లకు అనుమతిస్తే తీవ్రంగా నష్టం జరుగుతుందని ఈ విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని రైతు సంఘాలు వివరించాయి. చట్టాలను వెనక్కి తీసుకొని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని.. చట్టం రూపకల్పనకు ముందు అభిప్రాయాల తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.  ఈచర్చలు విఫలం కావడంతో  మరోసారి  రైతు సంఘాలతో  శనివారం కేంద్రం చర్చలు జరపనుంది.

Updated Date - 2020-12-04T01:53:32+05:30 IST