వ్యవసాయ చట్టాలను తిరస్కరించాలి

ABN , First Publish Date - 2020-12-26T09:21:19+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలను సమావేశపర్చి కొత్త వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ తీర్మానాలను ఆమోదించాలని ఇరు రాష్ట్రాల సీఎంలను అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ డిమాండ్‌ చేశారు...

వ్యవసాయ చట్టాలను తిరస్కరించాలి

  • వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ 


న్యూఢిల్లీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలను సమావేశపర్చి కొత్త వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ తీర్మానాలను ఆమోదించాలని ఇరు రాష్ట్రాల సీఎంలను అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి  బి. వెంకట్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొనడానికి మహారాష్ట్ర నుంచి వచ్చిన వందలాది మంది రైతులకు శుక్రవారం వెంకట్‌, సీఐటీయూ అధ్యక్షురాలు హేమలత స్వాగతం పలికారు.  ఈ చట్టాలు హరియాణ, పంజాబ్‌కే కాకుండా తెలుగు రాష్ట్రాలకు కూడా తీవ్ర హానీ తలపెడతాయని వెంకట్‌ తెలిపారు. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకుంటే  భవిష్యత్తులో రాష్ట్రాలు భిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.  ఈ నెల 26, 27 తేదీల్లో అంబానీ, ఆదానీ సంస్థల ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-12-26T09:21:19+05:30 IST