హథ్రస్ బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులే చంపారు: ప్రధాన నిందితుడు

ABN , First Publish Date - 2020-10-08T21:49:39+05:30 IST

అంతే కాకుండా నిందితులైన మిగతా ముగ్గురితో కలిసి బాధితురాలికి న్యాయం చేయాలని కోరామని చెప్పుకొచ్చాడు. ఆమె తల్లి, సోదరుడు ఆమెను విపరీతంగా హింసించారనీ అన్నాడు. నిందితుల్లో ఒక వ్యక్తి బాధితురాలి కుటుంబానికి తెలుసని పోలీసులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధాన నిందితుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి

హథ్రస్ బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులే చంపారు: ప్రధాన నిందితుడు

లఖ్‌నవూ: హథ్రాస్ అత్యాచారం & హత్య కేసులో మరో మలుపు తిరగనుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు తాజాగా యూపీ పోలీసులకు రాసిన లేఖ ఈ అనుమానాలకు తావునిస్తోంది. బాధితురాలిని ఆమె తల్లిదండ్రులే హింసించి చంపారని పోలీసులకు రాసిన లేఖలో ప్రధాన నిందితుడు పేర్కొన్నాడు. అంతే కాకుండా నిందితులైన మిగతా ముగ్గురితో కలిసి బాధితురాలికి న్యాయం చేయాలని కోరామని చెప్పుకొచ్చాడు. ఆమె తల్లి, సోదరుడు ఆమెను విపరీతంగా హింసించారనీ అన్నాడు. నిందితుల్లో ఒక వ్యక్తి బాధితురాలి కుటుంబానికి తెలుసని పోలీసులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధాన నిందితుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


సందీప్ ఠాకూర్.. హథ్రస్ అత్యాచారం & హత్య ఉదంతంలో ప్రధాన నిందితుడు. మరో ముగ్గురితో కలిసి జైళ్లో ఉన్నాడు. జైలు నుంచే ఉత్తరప్రదేశ్ పోలీసులకు లేఖ రాశాడు. ‘‘దారుణం జరిగిన రోజు, బాధితురాలిని కలుసుకోవడానికి నేను వెళ్లాను. అక్కడ ఆమె తల్లి, సోదరుడు కూడా ఉన్నారు. నన్ను అక్కడి నుంచి వెళ్లమని బాధితురాలు చెప్తే ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాను. మా స్నేహంపై కోపంతో ఉన్న ఆమె సోదరుడు, తల్లి  నేను ఊర్లోకి వెళ్లిన అనంతరం.. ఆమెను విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. నేను ఆమెను కనీస మాత్రం కొట్టలేదు. ఆమె తల్లి, సోదరుడు నాపై, మరో ముగ్గురిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేమంతా అమాయకులం. కానీ, తప్పుడు ఆరోపణల వల్ల జైళ్లో ఉన్నాం. సరైన దర్యాప్తు చేసి మాకు న్యాయం అందించండి’’ అని ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు రాసిన లేఖలో సందీప్ ఠాకూర్ పేర్కొన్నాడు. అనంతరం ఆ లేఖపై నలుగురు నిందితులు వేలి ముద్రలు వేశారు.

Updated Date - 2020-10-08T21:49:39+05:30 IST