పూజల పేరుతో 102 సవర్ల బంగారం, రూ.8.75 లక్షల నగదు స్వాహా!

ABN , First Publish Date - 2020-10-31T16:08:00+05:30 IST

ఇంట్లో బాణామతి జరిగినట్లు, దానికి పరిహార పూజలు చేయాలనే పేరుతో 102 సవర్ల నగలు, రూ.8.75 లక్షలను స్వాహా చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పాలవాక్కానికి చెందిన శివకుమార్‌(42) హార్బర్‌లో పని చేస్తున్నాడు. ఆయన భార్య సునీత 2018లో మరణించింది.

పూజల పేరుతో 102 సవర్ల బంగారం, రూ.8.75 లక్షల నగదు స్వాహా!

చెన్నై : ఇంట్లో బాణామతి జరిగినట్లు, దానికి పరిహార పూజలు చేయాలనే పేరుతో 102 సవర్ల నగలు, రూ.8.75 లక్షలను స్వాహా చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పాలవాక్కానికి చెందిన శివకుమార్‌(42) హార్బర్‌లో పని చేస్తున్నాడు. ఆయన భార్య సునీత 2018లో మరణించింది. పక్కింట్లో నివసిస్తున్న అముద లక్ష్మి తల్లి నారాయణి(45) శివకుమార్‌ కుటుంబంతో సన్నిహితంగా మెలిగేది. ఈ నేపథ్యంలో, సునీత మృతికి బాణామతి కారణమని, నగలు, నగదు ఉంచి 45 రోజులు పరి హారపూజలు చేస్తే పరిస్థితులు అనుకూలంగా మారతాయని, లేకుంటే కుటుంబలో ఉన్న అందరు మరణిస్తారని తెలిపింది. ఆ మాటలు నమ్మిన శివకుమార్‌ తన బంధువుల వద్ద 102 సవర్ల నగలు, రూ.8.75 నగదును తీసుకువచ్చి నారాయణికి అందించాడు. ఏడాది దాటినా నగలు, నగదు తిరిగి ఇవ్వకపోవడం, కొంతకాలంగా ఆమె అదృశ్యం కావడంతో శివకుమార్‌ నీలాంగరై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నారాయణిని వెతికి పట్టుకున్నారు. నగదు ఖర్చు పెట్టుకోవడంతో పాటు నగలను కుదవ బెట్టినట్లు నారాయణి పోలీసులకు తెలిపింది.

Read more