విపక్ష నేతగా ఫడణవీస్ భేష్!: శివసేన
ABN , First Publish Date - 2020-07-19T07:12:59+05:30 IST
మహారాష్ట్రలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అధికార శివసేన పార్టీ.. ప్రతిపక్ష నేత ఫడణవీ్‌సను ప్రశంసల్లో ముంచెత్తింది...

ముంబై, జూలై 18: మహారాష్ట్రలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అధికార శివసేన పార్టీ.. ప్రతిపక్ష నేత ఫడణవీ్‌సను ప్రశంసల్లో ముంచెత్తింది. ఈమేరకు తన అధికార పత్రిక ‘సామ్నా’లో ఎడిటోరియల్ రాసింది. కరోనా నివారణకు సర్కారు చేపడుతున్న చర్యలను ఫడణవీస్ అభినందించడం తమకు నైతిక బలాన్నిచ్చిందని శివసేన వ్యాఖ్యానించింది.