ఫేస్‌బుక్‌ అధికారిణి ఆంఖీదాస్‌ రాజీనామా

ABN , First Publish Date - 2020-10-28T07:18:10+05:30 IST

ఫేస్‌బుక్‌ ప్రజా విధానాల విభాగం అధిపతి ఆంఖీదాస్‌ రాజీనామా చేశారు. 30 కోట్ల మంది యూజర్లున్న ఫేస్‌బుక్‌ సోషల్‌ మీడియా పోస్టుల నియంత్రణలో పక్షపాతంతో వ్యవహరిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో...

ఫేస్‌బుక్‌ అధికారిణి ఆంఖీదాస్‌ రాజీనామా

న్యూఢిల్లీ, అక్టోబరు 27: ఫేస్‌బుక్‌ ప్రజా విధానాల విభాగం అధిపతి ఆంఖీదాస్‌ రాజీనామా చేశారు. 30 కోట్ల మంది యూజర్లున్న ఫేస్‌బుక్‌ సోషల్‌ మీడియా పోస్టుల నియంత్రణలో పక్షపాతంతో వ్యవహరిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె వైదొలిగారు. సమాజ సేవ చేసేందుకే ఆంఖీదాస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు కంపెనీ వివరణ ఇచ్చింది. గత వారం డేటా ప్రైవసీపై జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి ఫేస్‌బుక్‌ తరఫున ఆంఖీదాస్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను ఎంపీలు రెండు గంటలు ప్రశ్నించారు. 

Updated Date - 2020-10-28T07:18:10+05:30 IST