ఉచిత వైద్యం కోసం బీజేపీ ఎంపీ రాజీనామా ఉపసంహరణ

ABN , First Publish Date - 2020-12-30T20:30:51+05:30 IST

24 గంటల్లోనే బీజేపీ ఎంపీ మన్సుఖ్ వాసవ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్, సీఎం

ఉచిత వైద్యం కోసం బీజేపీ ఎంపీ రాజీనామా ఉపసంహరణ

అహ్మదాబాద్: 24 గంటల్లోనే బీజేపీ ఎంపీ మన్సుఖ్ వాసవ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్, సీఎం విజయ్ రూపానీ జోక్యంతోనే ఈయన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కేవలం ఆరోగ్య సమస్యలు ఉండటం కారణంగానే రాజీనామా చేశాను. సీఎంతో కూడా ఇదే విషయంపై చర్చించాను. ఎంపీగా కొనసాగితేనే వెన్ను నొప్పి, గొంతు నొప్పికి ఉచితంగా వైద్యం అందుతుని పార్టీ సీనియర్లు తెలిపారు. ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఇది కుదరదన్నారు. నన్ను విశ్రాంతి తీసుకోమన్నారు. తనవంతు ఇతరులు నియోజకవర్గ బాధ్యతలు చూస్తారని తెలిపారు. పార్టీ నేతల నుంచి హామీ లభించడంతో నేను రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఎంపీగా కొనసాగుతాను. ప్రజలకు సేవ చేస్తాను.’’ అని మన్సుఖ్ ప్రకటించారు.  గుజరాత్‌ భరూచ్ లోక్‌సభ స్థానం నుంచి మన్సుఖ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంత కాలంగా స్థానికంగా ఉండే సమస్యలపై ఆయన గళమెత్తుతున్నారు. అయినా వాటికి పార్టీ నుంచి స్పందన రావడం లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన పార్టీకి రాజీనామా చేశారు.  

Updated Date - 2020-12-30T20:30:51+05:30 IST