పెంపుడు పిల్లికీ కరోనా?.. బెల్జియంలో కేసు..

ABN , First Publish Date - 2020-03-29T01:08:00+05:30 IST

ఓ పెంపుడు పిల్లికీ కరోనా సోకింది. వైరస్ సోకిన యజమాని తాకడం వల్లే ఈ మూగజీవికి వైరస్ సోకినట్లు పరిశోధకులు అనుమానిస్తున్నారు.

పెంపుడు పిల్లికీ కరోనా?.. బెల్జియంలో కేసు..

బెల్జియం: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆరులక్షలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు బెల్జియంలో ఓ అరుదైన కేసు వెలుగుచూసింది. ఇక్కడ ఓ పెంపుడు పిల్లికీ కరోనా సోకింది. వైరస్ సోకిన యజమాని తాకడం వల్లే ఈ మూగజీవికి వైరస్ సోకినట్లు పరిశోధకులు అనుమానిస్తున్నారు. అయితే ఇది చాలా అరుదైన కేసని, పెంపుడు జన్తివుల్ వల్ల ఈ వైరస్ వ్యాప్తి జరగదని వారు స్పష్టంచేశారు. ఎందుకైనా మంచిది పెంపుడు జంతువులను పట్టుకునే ముందు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని బెల్జియం ప్రభుత్వం సూచించింది. కాగా, ఇప్పటివరకు కరోనా కారణంగా ప్రపంచంలో 28వేలకుపైగా మరణించారు. శుక్రవారం ఇక్కరోజే స్పెయిన్ లో 823మంది మరణించారంటే.. ఈ మహమ్మారి ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు.


Updated Date - 2020-03-29T01:08:00+05:30 IST