గుజరాత్ ఆర్థిక పునరుజ్జీవం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2020-05-13T23:53:27+05:30 IST

గుజరాత్ ఆర్థిక పునరుజ్జీవం కోసం ఆరుగురు నిపుణులతో ఉన్నత

గుజరాత్ ఆర్థిక పునరుజ్జీవం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు

గాంధీ నగర్ : గుజరాత్ ఆర్థిక పునరుజ్జీవం కోసం ఆరుగురు నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మాజీ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హస్‌ముఖ్ అథియా నేతృత్వంవహిస్తారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా కోలుకోవడానికి అవసరమైన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


హస్‌ముఖ్ అథియా నేతృత్వంలో ఏర్పాటైన ఈ ఉన్నత స్థాయి కమిటీ తాత్కాలిక నివేదికను రెండు వారాల్లోగా సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. తుది నివేదికను ఓ నెలలోగా సమర్పించాలని ఆదేశించింది. 


ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వద్ద కార్యదర్శి అశ్వనీ కుమార్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సమాచారాన్ని వెల్లడించారు. గుజరాత్ ఆర్థిక పునరుజ్జీవం కోసం ఆరుగురు నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ కమిటీని మాజీ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హస్‌ముఖ్ అథియా నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా కోలుకోవడానికి అవసరమైన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేస్తుందన్నారు. 


రంగాలవారీగా సంభవించిన ఆర్థిక నష్టాలను ఈ కమిటీ అంచనావేసి, తగిన సిఫారసులు చేస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, దిద్దుబాటు చర్యలను సిఫారసు చేస్తుందన్నారు.


రాష్ట్రంలో కూలీలు, కార్మికులు సులువుగా అందుబాటులో ఉండేందుకు తీసుకోవలసిన చర్యలను సూచిస్తుందన్నారు. 


Read more