జేడీయూలో విలీనం కానున్న ఉపేంద్ర కుష్వాహ?

ABN , First Publish Date - 2020-12-06T18:04:43+05:30 IST

ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత... రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహ పునరాలోచనలో పడినట్లు సమాచారం. జేడీయూ

జేడీయూలో విలీనం కానున్న ఉపేంద్ర కుష్వాహ?

పాట్నా : ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత... రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహ పునరాలోచనలో పడినట్లు సమాచారం. జేడీయూ, ఎన్డీయేను కాదని, రాష్ట్రంలో సాధించేది ఏమీ లేదన్న ఓ ప్రాథమిక అవగాహనకు వచ్చేశారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో భేటీ అయిన తర్వాత ఈ విషయం మరింత రూఢీ అయ్యింది. ఆయన పార్టీని జేడీయూలో విలీనం చేయడం లేదా... ఎన్డీయేకు మద్దతు పలకడం.. ఈ రెండు మార్గాలే కుష్వాహ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీని జేడీయూలో విలీనం చేసినా, లేదా ఎన్డీయేకు మద్దతు పలికినా... అత్యంత కీలమైన విద్యాశాఖను కేటాయిస్తామన్న హామీ కూడా సీఎం నితీశ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ తాజా కదలికపై రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి భోలా శర్మ మాట్లాడుతూ... ‘‘ఎన్డీయేలో తిరిగి చేరే అంశాన్ని మేం తోసిపుచ్చలేం. మా అధ్యక్షుడు కుశ్వాహ నితీశ్‌తో భేటీ అయ్యారు. ఎన్డీయేలోకి తిరిగి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. జేడీయూలో విలీనం కావాలన్న ప్రతిపాదనా మా వద్ద ఉంది.’’ అని భోలా శర్మ పేర్కొన్నారు. 

Read more