బుర్జ్ ఖలీఫాపై గాంధీ చిత్రాల ప్రదర్శన
ABN , First Publish Date - 2020-10-03T17:09:55+05:30 IST
ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్స్‌పై గాంధీజీ చిత్రాలను ప్రదర్శించి ఘన నివాళులర్పించారు.

ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్స్‌పై గాంధీజీ చిత్రాలను ప్రదర్శించి ఘన నివాళులర్పించారు. మహాత్ముడి 151వ జయంతి సందర్భంగా యూఏఈలోని ఈ భవనంపై ప్రత్యేక ఎల్ఈడీ షో నిర్వహించారు. అబుదాబిలోని భారత్ ఎంబసీ, దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. గాంధీజీ చిత్రాలతోపాటు ఆయన సందేశాలను ప్రదర్శించారు. ఎల్ఈడీ వెలుగుల్లో భారత మువ్వెన్నల పతాకం మెరిసింది.