కరోనాతో మాజీ ఆరోగ్యమంత్రి మృతి

ABN , First Publish Date - 2020-05-08T23:36:01+05:30 IST

వేలాది ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారి విలయతాండవం ఆగడంలేదు.

కరోనాతో మాజీ ఆరోగ్యమంత్రి మృతి

ఏథెన్స్: వేలాది ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారి విలయతాండవం ఆగడంలేదు. తాజాగా గ్రీస్ దేశ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, హార్ట్ సర్జన్ డిమిట్రిస్ క్రెమస్టినోస్ ఈ మహమ్మారికి బలయ్యారు. కరోనా సోకిన ఈయన్ను రెండు వారాల క్రితం దేశరాజధాని ఏథెన్స్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక్కడ చికిత్స పొందుతూ 78 ఏళ్ల డిమిట్రిస్ మరణించారు. కాగా, గ్రీస్‌లో ఇప్పటి వరకు 2,600 కరోనా కేసులు నమోదవగా, వారిలో 140 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-05-08T23:36:01+05:30 IST