రాజ్యాంగ స్వేచ్ఛను కాపాడండి: వెంకయ్య పిలుపు

ABN , First Publish Date - 2020-06-26T07:30:51+05:30 IST

ఎమర్జెన్సీని ఽధిక్కరిస్తూ ఆ చీకటి రోజుల్లో ప్రజలు జరిపిన రెండో స్వాతంత్య్ర సంగ్రామాన్ని గుర్తు చేసుకుని ఇవాళ రాజ్యాంగ స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు...

రాజ్యాంగ స్వేచ్ఛను కాపాడండి: వెంకయ్య పిలుపు

న్యూఢిల్లీ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): ఎమర్జెన్సీని ధిక్కరిస్తూ ఆ చీకటి రోజుల్లో ప్రజలు జరిపిన రెండో స్వాతంత్య్ర సంగ్రామాన్ని గుర్తు చేసుకుని ఇవాళ రాజ్యాంగ స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ మనకు హుందాగా జీవించే హక్కును కల్పించిందని, దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. కొవిడ్‌ను నియంత్రించేందుకు 3 నెలల క్రితం ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారని, ఇది చట్టబద్ధమైన నిర్బంధమని వెంకయ్య అన్నారు. అయితే ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులను రద్దు చేసి నేతలను, ప్రజలను జైళ్లలో బంధించడం చట్ట వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-06-26T07:30:51+05:30 IST