పారాసిటమాల్ పంపినందుకు భారత్‌కు థాంక్స్: బ్రిటన్

ABN , First Publish Date - 2020-04-16T03:24:52+05:30 IST

అవసర సమయంలో తమకు పారాసిటమాల్ మందును పంపినందుకు భారత్‌కు బ్రిటన్ ధన్యవాదాలు తెలిపింది.

పారాసిటమాల్ పంపినందుకు భారత్‌కు థాంక్స్: బ్రిటన్

లండన్: అవసర సమయంలో తమకు పారాసిటమాల్ మందును పంపినందుకు భారత్‌కు బ్రిటన్ ధన్యవాదాలు తెలిపింది. భారత్‌ నుంచి తొలి విడతగా 28లక్షల ప్యాకెట్ల పారాసిటమాల్‌ ఇంగ్లండ్‌ చేరింది. ఈ క్రమంలోనే బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య కార్యదర్శి లిజ్ ట్రస్ భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పారాసిటమాల్ ప్యాకెట్లను బ్రిటన్‌లోని సూపర్ మార్కెట్లన్నింటికీ సరఫరా చేస్తామని ఆమె చెప్పారు. ‘ఈ ఒక్క దిగుమతితో బ్రిటిష్ సూపర్ మార్కెట్లలో దాదాపు మరో 30లక్షల పారాసిటమాల్ ప్యాకెట్లు చేరినట్లే’ అని ట్రస్ పేర్కొన్నారు. కాగా, ఇటీవలే అత్యవసర ఔషధాల ఎగుమతిపై నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఆ తర్వాత వివిధ దేశాలకు ఔషధాలను ఎగుమతి చేయడం ప్రారంభించింది.

Updated Date - 2020-04-16T03:24:52+05:30 IST