కశ్మీర్ లోయలో ఎన్‌కౌంటర్...
ABN , First Publish Date - 2020-06-25T12:43:53+05:30 IST
జమ్మూకశ్మీర్‌లోని ఉత్తర కశ్మీర్ పరిధిలోని సోపేరీ వద్ద గురువారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి....

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లోని ఉత్తర కశ్మీర్ పరిధిలోని సోపేరీ వద్ద గురువారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సోపేరీ ప్రాంతంలోని హార్డ్ శివ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం మేర భారత సైన్యానికి చెందిన 22 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి గాలింపు చేపట్టారు. గాలిస్తున్న భద్రతా జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆర్మీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు మరణించి ఉంటారని ఆర్మీజవాన్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం జవాన్లు గాలింపు కొనసాగిస్తున్నారు. జూన్ 23వతేదీన పుల్వామాలోని బండ్ జూ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు, ఓ సీఆర్ పీఎఫ్ జవాన్ మరణించారు. గత 20 రోజులుగా జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలతో ఎదురుకాల్పులు సాగుతూనే ఉన్నాయి.