సెక్రటేరియట్ విధుల్లో చేరుతున్న ఉద్యోగులు
ABN , First Publish Date - 2020-06-01T20:44:48+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం ఉద్యోగులు మళ్లీ విధుల్లో చేరుతున్నారు. ఉద్యోగుల హాజరు తప్పనిసరి అంటూ..
లక్నో: ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం ఉద్యోగులు మళ్లీ విధుల్లో చేరుతున్నారు. ఉద్యోగుల హాజరు తప్పనిసరి అంటూ ఉత్తప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం నుంచి సిబ్బంది విదులకు హాజరవుతున్నారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే ఉద్యోగులను విధుల్లోకి అనుమతిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలనే నిబంధనలతో పని వేళలు సజావుగా సాగేందుకు వీలుగా మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగులు ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది.