కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన షా

ABN , First Publish Date - 2020-06-25T17:38:12+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం మంత్రి విరుచుకుపడ్డారు. 45 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఓ కుటుంబం అధికార దాహంతో దేశంలో ఎమర్జెన్సీ విధించిందని షా గుర్తు చేశారు. దీంతో రాత్రికి రాత్రే దేశం జైలులా మారిందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన షా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం మంత్రి విరుచుకుపడ్డారు. 45 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఓ కుటుంబం అధికార దాహంతో దేశంలో ఎమర్జెన్సీ విధించిందని షా గుర్తు చేశారు. దీంతో రాత్రికి రాత్రే దేశం జైలులా మారిందని చెప్పారు. మీడియాను, న్యాయస్థానాలను అణచివేశారని, భావ ప్రకటిత స్వేచ్ఛను తొక్కేశారని షా తెలిపారు. లక్షలాది మంది ప్రజల ఉద్యమం కారణంగా ఎమర్జెన్సీ ఎత్తివేశారని షా గుర్తు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడిందని, అయితే కాంగ్రెస్ కనుమరుగైందని చెప్పారు.


జాతీయ ప్రయోజనాలను ఓ కుటుంబానికి ఫణంగా పెడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలపై షా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తున్నారని, పార్టీలోనుంచి తొలగిస్తున్నారని  చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసహనం నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎమర్జెన్సీ మనస్తత్వం ఎందుకుందో ప్రశ్నించుకోవాలని షా సూచించారు. లేకపోతే ప్రజల నుంచి మరింత దూరమౌతారని షా కాంగ్రెస్ పార్టీకి సూచించారు. 

Updated Date - 2020-06-25T17:38:12+05:30 IST