విద్యుత్తు చట్ట సవరణను 11 రాష్ట్రాలు వ్యతిరేకించాయి: ఏఐపీఈఎఫ్
ABN , First Publish Date - 2020-07-10T07:56:45+05:30 IST
విద్యుత్తు చట్ట సవరణ బిల్లు-2020లోని అనేక నిబంధనలను ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు 11 రాష్ట్రాలు వ్యతిరేకించాయని అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) పేర్కొంది...

న్యూఢిల్లీ, జూలై 9: విద్యుత్తు చట్ట సవరణ బిల్లు-2020లోని అనేక నిబంధనలను ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు 11 రాష్ట్రాలు వ్యతిరేకించాయని అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) పేర్కొంది. కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఘండ్, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్, రాజస్థాన్, పంజాబ్‌లతోపాటు పుదుచ్చేరిలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని ఏఐపీఈఎఫ్ ప్రతినిధి వీకే గుప్తా తెలిపారు.