ఎన్నికల బాండ్లపై అత్యవసర విచారణ

ABN , First Publish Date - 2020-10-28T07:35:57+05:30 IST

ఎన్నికల బాండ్ల(ఎలక్టోరల్‌ బాండ్స్‌) పథకాన్ని సవాలు చేస్తూ తాము గతంలో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌)ను అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీం కోర్టును ’అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌)’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రయించింది...

ఎన్నికల బాండ్లపై అత్యవసర విచారణ

  • సుప్రీంను ఆశ్రయించిన ఎన్‌జీవో


న్యూఢిల్లీ, అక్టోబరు 27: ఎన్నికల బాండ్ల(ఎలక్టోరల్‌ బాండ్స్‌) పథకాన్ని సవాలు చేస్తూ తాము గతంలో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌)ను అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీం కోర్టును ’అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌)’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రయించింది. 2018 జనవరి 2న ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్‌, జూలై, అక్టోబరు నెలల్లో సదరు బాండ్లను విక్రయించాల్సి ఉందని.. కానీ ఏప్రిల్‌, జూలైలో విక్రయించలేదని కోర్టుకు ఎన్‌జీవో తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తెలిపారు. ఇప్పుడు బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో.. బాండ్ల విక్రయానికి, నగదుగా మార్చడానికి తాజాగా భారతీయ స్టేట్‌ బ్యాంక్‌కి అధికారమిచ్చారని వివరించారు.


Updated Date - 2020-10-28T07:35:57+05:30 IST