కర్ణాటక డిప్యూటీ సీఎం కుటుంబంలో 8 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-10-19T23:12:29+05:30 IST

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్ కర్జల్ కుటుంబాన్ని కరోనా వెంటాడుతోంది. ఇప్పటివరకూ తన కుటుంబంలో 8 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా...

కర్ణాటక డిప్యూటీ సీఎం కుటుంబంలో 8 మందికి కరోనా

కర్ణాటక డిప్యూటీ సీఎం కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్

వెంటిలేటర్‌పై ఆయన కుమారుడు

బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్ కర్జల్ కుటుంబాన్ని కరోనా వెంటాడుతోంది. ఇప్పటివరకూ తన కుటుంబంలో 8 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన ప్రకటించారు. ఆసుపత్రిలో 19 రోజుల చికిత్స అనంతరం తాను కరోనా నుంచి కోలుకున్నానని, తన భార్య కూడా ఇటీవలే కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. తన కుమారుడు డాక్టర్ గోపాల్ కర్జల్ గత 23 రోజులుగా కరోనా సోకి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడని గోవింద్ ట్వీట్ చేశారు.


కుటుంబపరంగానే కాకుండా నియోజవర్గంలో వరద ప్రభావం కారణంగా కూడా గోవింద్ కర్జల్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముధోల్ నియోజకవర్గంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భీమా నదికి వరద ఉధృతి పెరుగుతుండటమే ఇందుకు కారణం. ఇటు కరోనా కారణంగా కుటుంబపరంగానూ, వరదల కారణంగా నియోజకవర్గంలోనూ సమస్యలు నెలకొనడంతో గోవింద్ కర్జల్‌ను సమస్యలు చుట్టుముట్టాయి.

Updated Date - 2020-10-19T23:12:29+05:30 IST