ఈజిప్టు పిరమిడ్ వద్ద ఫొటోషూట్...మోడల్, ఫొటోగ్రాఫర్ అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-03T15:22:38+05:30 IST

ఈజిప్టు దేశంలోని పురాతన పిరమిడ్ వద్ద పురాతన దుస్తుల్లో ఒక మోడల్ ఫొటో షూట్ చేసిన ఘటనపై మోడల్, ఫొటోగ్రాఫర్లను ఈజిప్టు పోలీసులు అరెస్ట్ చేశారు.....

ఈజిప్టు పిరమిడ్ వద్ద ఫొటోషూట్...మోడల్, ఫొటోగ్రాఫర్ అరెస్ట్

కైరో (ఈజిప్టు):ఈజిప్టు దేశంలోని పురాతన పిరమిడ్ వద్ద పురాతన దుస్తుల్లో ఒక మోడల్ ఫొటో షూట్ చేసిన ఘటనపై మోడల్, ఫొటోగ్రాఫర్లను ఈజిప్టు పోలీసులు అరెస్ట్ చేశారు. కైరో నగర శివార్లలో పిరమిడ్ ఆఫ్ జోజర్ వద్ద ఫ్యాషన్ మోడల్ ఫొటోషూట్ చేసిన ఘటనలో మోడల్ సల్మా అల్ షిమి, ఫొటోగ్రాఫర్ ను ఈజిప్టు పోలీసులు అరెస్టు చేశారు.మోడల్ డాన్సర్ సల్మా అల్ షిమి  పురాతన దుస్తుల్లో పిరమిడ్ వద్ద ఫొటో షూట్ చేశారు. దీంతో ఆమెతోపాటు ఫొటోగ్రాఫరుపై కేసు నమోదు చేశారు. సల్మాఅల్ షిమి పిరమిడ్ వద్ద తీయించుకున్న చిత్రాలు, వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 


షిమికి ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.దీంతో ఈజిప్ట్ యొక్క ప్రాచీన వారసత్వం ప్రకారం సరిగా లేని దుస్తులను ధరించినందుకు షిమిని అరెస్టు చేయాలని పలు సోషల్ మీడియా నెటిజన్లు కోరారు. ఫోటో షూట్‌ల కోసం ఈజిప్టు పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు షిమీపై అభియోగాలు మోపారు. పురావస్తు ప్రదేశాల్లో ఛాయచిత్రాలు తీయడంపై నిషేధం ఉందా? లేదా అసభ్యంగా చిత్రాలు తీశారని కేసు పెట్టారా అని నెటిజన్లు ప్రశ్నించారు.

Updated Date - 2020-12-03T15:22:38+05:30 IST