కరోనా భయం... స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన సీఎం

ABN , First Publish Date - 2020-03-13T20:46:18+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ...

కరోనా భయం... స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన సీఎం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 17 కేసులు కేరళలో నమోదు కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో 11 కరోనా పాజిటివ్ నమోదవడంతో యూపీలో పాఠశాలలు, కళాశాలలను మార్చి 22 వరకూ మూసివేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మార్చి 22న పరిస్థితిపై సమీక్ష జరిపి సెలవులను పొడిగించాలా.. వద్దా అనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.


దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకూ ఢిల్లీలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జన సందోహం ఎక్కువగా ఉంటే.. కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఈ సంవత్సరం ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడం లేదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు.. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

Updated Date - 2020-03-13T20:46:18+05:30 IST