పన్నీర్‌ సెల్వంతో ఎడప్పాడి భేటీ

ABN , First Publish Date - 2020-10-08T15:21:39+05:30 IST

అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపికైన ఆ పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి

పన్నీర్‌ సెల్వంతో ఎడప్పాడి భేటీ

చెన్నై : అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపికైన ఆ పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి బుధవారం సాయంత్రం పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంను కలుసుకున్నారు. ఎడప్పాడి పళనిస్వామి అడయార్‌ గ్రీన్‌వేస్‌ రోడ్డులో ఉన్న పన్నీర్‌సెల్వం నివాసానికి సాయంత్రం ఆరుగంటలకు వెళ్ళారు. ఆ సందర్భంగా పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు.


 అదే సమయంలో వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకుని ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎడప్పాడి మాట్లాడుతూ తనను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ప్రకటించిన తన సోదరసమానుడు పన్నీర్‌సెల్వంకు కృతజ్ఞతలు తెలిపేందుకే కలుసుకున్నానని చెప్పారు.

Updated Date - 2020-10-08T15:21:39+05:30 IST