ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నిస్తున్న ఈడీ

ABN , First Publish Date - 2020-10-19T19:16:14+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నిస్తోంది. జమ్మూకశ్మీర్ అసోసియేషన్‌లో

ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నిస్తున్న ఈడీ

శ్రీనగర్ : మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నిస్తోంది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో నిధుల గోల్‌మాల్ విషయంలో ఫరూక్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ శ్రీనగర్ లోనే జరుగుతోంది. జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో 113 కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగింది. దీనిని జమ్మూ పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఆ తర్వాత దీనిని కోర్టు సీబీఐకి అప్పజెప్పింది. ఆ తర్వాత దీనిపై ఈడీ ఓ కేసును నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫరూక్ ను ఈడీ ప్రశ్నిస్తోంది.


ఈ వ్యవహారంపై ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ స్పందించారు. తమ ఇంటిపై ఈడీ ఎలాంటి దాడులు చేయలేదని ప్రకటించారు. ఈడీ సమన్లకు పార్టీ తరపున సమాధానం ఇస్తామని తెలిపారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ కశ్మీర్ వేదికగా కొత్త కూటమి ఆవిర్భవించిన నేపథ్యంలోనే కేంద్రం ఇలాంటివి చేస్తోందని ఒమర్ ఆరోపించారు. 


Updated Date - 2020-10-19T19:16:14+05:30 IST