ఈడీ హెడ్ క్వార్టర్స్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-06T12:29:08+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్‌లో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది.....

ఈడీ హెడ్ క్వార్టర్స్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్‌లో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్‌లో ఓ అధికారితో పాటు మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్‌లో కరోనా సోకిన వారితో 20 మంది ఈడీ అధికారులు కలిసి పనిచేశారని తేలడంతో వారందరికీ కూడా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ లకు కరోనా పరీక్షలు చేసి క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయించారు. ఈడీ కార్యాలయాన్ని వారానికి రెండు సార్లు శానిటైజ్ చేయించడంతోపాటు అధికారులు ప్రయాణిస్తున్న కార్లను కూడా ప్రతీరోజు శానిటైజ్ చేస్తున్నారు. 


Updated Date - 2020-06-06T12:29:08+05:30 IST