కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా
ABN , First Publish Date - 2020-03-24T17:08:43+05:30 IST
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు..

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి నడుం బిగించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సరికాదని భావించిన ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అయితే.. రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేసినట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం తదుపరి షెడ్యూల్‌పై స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం లాక్‌డౌన్ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపించింది. తొలిరోజు రోడ్లపై గుంపులుగా కనిపించిన ప్రజలు.. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారన్న విషయం తెలియడంతో రోడ్లపైకి వచ్చే సాహసం చేయలేదు.