సమన్వయంతో బలగాల ఉపసంహరణ సరిహద్దుల్లో నిలకడగా పరిస్థితులు: చైనా
ABN , First Publish Date - 2020-11-27T08:01:09+05:30 IST
తూర్పు లద్ధాఖ్‌లోని ఎల్‌ఏసీ వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్, చైనాలు స్పష్టమైన, లోతైన సమాచార మార్పిడి, సమన్వయాన్ని కొనసాగించాయని చైనా మిలిటరీ పేర్కొంది. ఉద్రిక్తతలకు స్వస్తి పలకడంలో భాగంగా ఇరు

బీజింగ్, నవంబరు 26: తూర్పు లద్ధాఖ్‌లోని ఎల్‌ఏసీ వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్, చైనాలు స్పష్టమైన, లోతైన సమాచార మార్పిడి, సమన్వయాన్ని కొనసాగించాయని చైనా మిలిటరీ పేర్కొంది. ఉద్రిక్తతలకు స్వస్తి పలకడంలో భాగంగా ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య ఈ నెల 6న జరిగిన చర్చల అనంతరం సరిహద్దుల్లో పరిస్థితు లు నిలకడగా ఉన్నాయని చైనా జాతీయ రక్షణశాఖ ప్రతినిధి, సీనియర్ కల్నల్ రెన్ గుయోకియాంగ్ వివరించారు. సైనిక దళాలు సంయమనం పాటించే అంశంపై చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడానికి ఎటువంటి అపోహలు, అపార్థాలకు తావులేకుండా ఇరుపక్షాలు మనస్ఫూర్తిగా అంగీకరించాయన్నారు. భారత్‌తో సైనిక, దౌత్యపరమైన చర్చలు కొనసాగించడానికి చైనా సిద్ధంగా ఉందన్నారు. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలను కాపాడటానికి భారత్ సానుకూల వైఖరితో చైనాకు సహకరిస్తుందని ఆశిస్తున్నామని గుయోకియాంగ్ పేర్కొన్నారు.