మహారాష్ట్రలో భూకంపం... 3.3 తీవ్రత నమోదు!
ABN , First Publish Date - 2020-10-27T12:16:37+05:30 IST
మహారాష్ట్రలోని నాగపూర్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది.

నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదయ్యింది. ఈరోజు ఉదయం 4.10 గంటలకు నాగపూర్లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ప్రాణ,ఆస్తి నష్టం జరగినట్టు సమాచారమేదీ లేదు. కాగా దీనికి ముందు సిక్కిం, గ్యాంగ్టక్లలో ఆదివారం భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సొస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం సిక్కిం, గ్యాంగ్టక్లలో 3.6 తీవ్రతతో భూమి కంపించింది. ఇది మధ్యాహ్నం 12 గంటల 6 నిముషాల సమయంలో చోటుచేసుకుంది.