రష్యా కురీల్ దీవుల్లో భూకంపం

ABN , First Publish Date - 2020-03-25T15:11:28+05:30 IST

ప్రపంచాన్ని ఒక వైపు కరోనా వైరస్ వణికిస్తుండగా, మరో వైపు రష్యా దేశంలోని కురీల్ దీవుల్లో బుధవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది.....

రష్యా కురీల్ దీవుల్లో భూకంపం

మాస్కో (రష్యా): ప్రపంచాన్ని ఒక వైపు కరోనా వైరస్ వణికిస్తుండగా, మరో వైపు రష్యా దేశంలోని కురీల్ దీవుల్లో బుధవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. రష్యా కురీల్ దీవుల్లో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.5 గా ఉందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. రష్యన్ పట్టణానికి 219 కిలోమీటర్ల దూరంలోని కురీల్ దీవుల్లో సంభవించిన భూకంపం 56.7 కిలోమీటర్ల లోతులో వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎంత ఆస్తినష్టం జరిగిందనేది ఇంకా తెలియలేదు. 

Read more