మణిపూర్‌లో భూకంపం
ABN , First Publish Date - 2020-10-07T11:35:33+05:30 IST
మణిపూర్‌లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.

ఉక్రూల్ (మణిపూర్): మణిపూర్‌లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. మణిపూర్‌లోని ఉక్రూల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 3.32 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. ఉక్రూల్ ప్రాంతంలో సంభవించిన భూకంపం పదికిలోమీటర్ల లోతులో నుంచి వచ్చిందని అధికారులు చెప్పారు. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు. గాఢనిద్రలో ఉన్న ప్రజలు భూప్రకంపనలతో బయటకు పరుగులు తీశారు.
సెప్టెంబరు 1వతేదీన ఉక్రూల్ నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. సెప్టెంబరు 1న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైంది. తరచూ భూప్రకంపనలతో మణిపూర్ ప్రజలు భయాదోళనలు చెందుతున్నారు.