అసోంలో మళ్లీ భూకంపం...
ABN , First Publish Date - 2020-07-18T12:35:08+05:30 IST
వరుస భూకంపాలు అసోం, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి....

హైలాకుండీ (అసోం): వరుస భూకంపాలు అసోం, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అసోం రాష్ట్రంలోని హైలాకుండీలో శనివారం తెల్లవారుజామున 4.25 గంటలకు భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. శుక్రవారం రాత్రి మిజోరంలోని దక్షిణ చంఫాయ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీర్ లోనూ ఇటీవల పలుసార్లు భూమి కంపించింది. వరుస భూప్రకంపనలతో ప్రజలు వణికిపోతున్నారు. భూమి కంపించినప్పుడల్లా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు.