ఢిల్లీలో 24గంటల్లో 2 సార్లు కంపించిన భూమి

ABN , First Publish Date - 2020-04-14T07:16:23+05:30 IST

గడిచిన 24గంటల్లో దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో భూమి రెండుసార్లు కంపించింది. సోమవారం స్వల్పంగా కంపించగా, ఇది రిక్టర్‌ స్కేల్‌పై 2.7గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ...

ఢిల్లీలో 24గంటల్లో 2 సార్లు కంపించిన భూమి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: గడిచిన 24గంటల్లో దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో భూమి రెండుసార్లు కంపించింది. సోమవారం స్వల్పంగా కంపించగా, ఇది రిక్టర్‌ స్కేల్‌పై 2.7గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ(ఎన్‌సీఎస్‌) హెడ్‌ జేఎల్‌ గౌతమ్‌ తెలిపారు. ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని, ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. కాగా, ఆదివారం 3.5 తీవ్రతతో భూమి కంపించింది.  


Updated Date - 2020-04-14T07:16:23+05:30 IST