ఉత్తరాఖండ్‌లో భూకంపం..భయాందోళనల్లో జనం
ABN , First Publish Date - 2020-12-01T16:36:33+05:30 IST
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ సమీపంలో మంగళవారం భూకంపం సంభవించింది.....
హరిద్వార్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ సమీపంలో మంగళవారం భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 9.41 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.9 గా నమోదైంది. హరిద్వార్ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ఉత్తరాఖండ్ అధికారులు చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గతంలోనూ పలు సార్లు భూమి కంపించింది.