అండమాన్ దీవుల్లో స్వల్ప భూకంపం
ABN , First Publish Date - 2020-11-13T16:58:00+05:30 IST
అండమాన్ దీవుల్లో ఇవాళ ఉదయం స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టార్ స్కేలు భూకంప తీవ్ర 4.3గా ఉన్నట్టు నేషనల్...
న్యూఢిల్లీ: అండమాన్ దీవుల్లో ఇవాళ ఉదయం స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టార్ స్కేలు భూకంప తీవ్రత 4.3గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) పేర్కొంది. శుక్రవారం ఉదయం 8:45 గంటల సమయంలో భూ ప్రకంపనలు చోటుచేకున్నట్టు ఎన్‌సీఎస్ వెల్లడించింది. అయితే ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్టు ఎన్‌సీఎస్ తెలిపింది. కాగా ఈ ఏడాది జూలైలో కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో మూడు సార్లు స్వల్ప భూకంపాలు చోటుచేసుకున్నాయి. ఇందులో రెండు భూకంపాలు 40 నిమిషాల వ్యవధిలో రావడం, అందునా రిక్టార్ స్కేలుపై వాటి తీవ్రత 5కు పైనే ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.