మేఘాలయ వెస్ట్ ఖాసీ హిల్ ప్రాంతంలో భూకంపం
ABN , First Publish Date - 2020-11-03T11:02:31+05:30 IST
మేఘాలయలో మంగళవారం మరోసారి భూ కంపం సంభవించింది....
షిల్లాంగ్ (మేఘాలయ): మేఘాలయలో మంగళవారం మరోసారి భూ కంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 1.13 గంటలకు మేఘాలయలోని వెస్ట్ ఖాసీ హిల్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 28వతేదీన 24 గంటల వ్యవధిలో మేఘాలయలో భూమి రెండు సార్లు కంపించింది. జూన్ నెలలో మేఘాలయలో వచ్చిన భూకంపం తీవ్రత మాగ్నిట్యూడ్‌పై 3.9గా నమోదైంది. మేఘాలయలో తరచూ భూమి కంపిస్తుండటంతో దీనివల్ల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
మేఘాలయలోని తురా ప్రాంతానికి పశ్చిమ దిశగా 79 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం చోటుచేసుకుంది. ఇప్పటికే కరోనా మహమ్మారితో వణుకుతున్న మేఘాలయ ప్రజలకు తాజా భూప్రకంపనలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని మేఘాలయ అధికారులు చెప్పారు.