ఇరాన్‌లో భూకంపం...ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు

ABN , First Publish Date - 2020-05-08T12:10:12+05:30 IST

కరోనా వైరస్ తో అల్లాడుతున్న ఇరాన్ దేశంలో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా’ గురువారం రాత్రి భూకంపం సంభవించింది....

ఇరాన్‌లో భూకంపం...ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు

టెహరాన్ (ఇరాక్): కరోనా వైరస్ తో అల్లాడుతున్న ఇరాన్ దేశంలో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా’ గురువారం రాత్రి భూకంపం సంభవించింది.ఉత్తర ఇరాన్ దేశంలో గురువారం అర్దరాత్రి భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఇరాన్ దేశంలో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి కైనూష్ జహాన్ పూర్ శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో వెల్లడించారు. టెహరాన్ నగరానికి సమీపంలోని దమావంద్ ప్రాంతంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 


Updated Date - 2020-05-08T12:10:12+05:30 IST