ఇరాన్‌లో కరోనాకు తోడు భూప్రకంపనలు...
ABN , First Publish Date - 2020-03-16T12:25:47+05:30 IST
కరోనా వైరస్‌తో అల్లాడుతున్న ఇరాన్ దేశంలో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలు చెందారు....
టెహరాన్ (ఇరాన్): కరోనా వైరస్‌తో అల్లాడుతున్న ఇరాన్ దేశంలో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలు చెందారు. అసలే కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తుండటంతో ఇరాన్ వాసులు ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో చేరారు. ఇరాన్ దేశంలోని బండర్ ఖామీర్ నగరానికి 39 కిలోమీటర్ల దూరంలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.4 అని ఇరాన్ సెస్మాలాజికల్ సెంటర్, టెహరాన్ యూనివర్శిటీ జియోఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెప్పారు. 16 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల ఇరాన్ దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఆస్తినష్టం, ప్రాణనష్టం గురించి ఇంకా వివరాలు తెలియలేదు.