రష్యా-ఇండియా-చైనా విదేశాంగ మంత్రుల సమావేశంలో జై ఏమన్నారంటే!

ABN , First Publish Date - 2020-06-23T21:25:33+05:30 IST

న్యూఢిల్లీ: రష్యా-ఇండియా-చైనా (రిక్) విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ మాట్లాడారు.

రష్యా-ఇండియా-చైనా విదేశాంగ మంత్రుల సమావేశంలో జై ఏమన్నారంటే!

న్యూఢిల్లీ: రష్యా-ఇండియా-చైనా (రిక్) విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ మాట్లాడారు. కాలపరీక్షను ఎదుర్కొని నిలబడిన అంతర్జాతీయ సంబంధాల సూత్రాలపై నమ్మకాన్ని పునరుద్ఘాటించేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే ప్రస్తుతం కావాల్సింది భావనలు, నిబంధనలు కాదని వాటి ఆచరణ అని చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ గొంతుకలన్నీ అన్ని మార్గాల్లోనూ నిదర్శనాలుగా నిలవాలన్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, భాగస్వాముల ప్రయోజనాలు కాపాడటం, భిన్నత్వానికి మద్దతీయడం, మంచిని పెంచడం చేయాలని సూచించారు. చైనా చెప్పేదొకటి, చేసేదొకటని లడక్ గల్వాన్ లోయ ఘటన నిరూపించడంతో డ్రాగన్ కంట్రీకి చురకలు తగిలేలా జై మాట్లాడినట్లు తెలుస్తోంది. 


జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్ర పూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. దీనిపై భారత్ కన్నెర్ర చేసింది. ఇకపై చైనాను నమ్మరాదని, డ్రాగన్‌కు హద్దులు సూచించాలని నిర్ణయించుకున్న భారత్ వాస్తవాధీన రేఖ వెంబడి నిఘాను పూర్తి స్థాయిలో పెంచేసింది. ప్రస్తుతం ఎల్‌ఏసీ వెంబడి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు, హెలికాఫ్టర్లు పహారా కాస్తున్నాయి.   

Updated Date - 2020-06-23T21:25:33+05:30 IST