డీఎంకే ప్రధాన కార్యదర్శి బరిలో దురై మురుగన్
ABN , First Publish Date - 2020-03-16T20:30:28+05:30 IST
డీఎంకే కోశాధికారిగా ఉన్న దురై మురుగన్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయనున్నారు. డీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్ ..
చెన్నై: డీఎంకే కోశాధికారిగా ఉన్న దురై మురుగన్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయనున్నారు. డీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్ మృతి నేపథ్యంలో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఈనెల 29న పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగనున్న డీఎంకే సర్వసభ్య సమావేశంలో కోశాధికారి పదవికి మురుగన్ రాజీనామా చేసి ప్రధాన కార్యదర్శికి పోటీ చేస్తారు.
డీఎంకే ప్రధాన కార్యదర్శిగా 43 ఏళ్ల పాటు కొనసాగిన 97 ఏళ్ల అన్బళగన్ ఈనెల 7న చెన్నైలో కన్నుమూశారు. 1977 నుంచి తొమ్మిది సార్లు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా పని చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కూడా సేవలందించారు. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి ఆయన అత్యంత సన్నిహితుడు. 1944 నుంచి 1957 వరకూ పచ్చయప్ప కాలేజీలో లెక్చరర్‌గా కూడా పనిచేశారు.