నకిలీ ‘టోసిలిజుమాబ్‌’ ముఠా గుట్టు రట్టు

ABN , First Publish Date - 2020-07-20T07:03:29+05:30 IST

తీవ్ర ఇన్ఫెక్షన్‌ కలిగిన కరోనా రోగుల చికిత్సకు వాడుతున్న ‘టోసిలిజుమాబ్‌’ ఔషధాన్ని పోలిన నకిలీ ఇంజెక్షన్లను తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. గుజరాత్‌లోని సూరత్‌ కేంద్రంగా ఇలాంటి నకిలీ ఔషధాలను...

నకిలీ ‘టోసిలిజుమాబ్‌’ ముఠా గుట్టు రట్టు

అహ్మదాబాద్‌, జూలై 19 : తీవ్ర ఇన్ఫెక్షన్‌ కలిగిన కరోనా రోగుల చికిత్సకు వాడుతున్న ‘టోసిలిజుమాబ్‌’ ఔషధాన్ని పోలిన నకిలీ ఇంజెక్షన్లను తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. గుజరాత్‌లోని సూరత్‌ కేంద్రంగా ఇలాంటి నకిలీ ఔషధాలను తయారుచేస్తున్న జెనిక్‌ ఫార్మాను ఆ రాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ మండలి అధికారులు సీజ్‌ చేశారు. ఇందుకు వినియోగిస్తున్న రూ.8 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


నకిలీ టోసిలిజుమాబ్‌ తయారీ రాకెట్‌కు సొహైల్‌ ఇస్మాయిల్‌ తాయ్‌ అనే వ్యక్తి సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. స్వయంగా అతడే కొందరు దళారులకు ఈ నకిలీ ఔషధాలను చేర్చాడని.. వారి నుంచి అవి నేరుగా పలు మందుల దుకాణాలకు చేరాయని విచారణలో తేలింది. తాయ్‌ సహా మొత్తం ఐదుగురిపై కేసులు నమోదు చేయనున్నట్లు  ఎఫ్‌డీసీఏ కమిషనర్‌ హేమంత్‌ కోషియా వెల్లడించారు. నకిలీ టోసిలిజుమాబ్‌ ఇంజెక్షన్‌ పెట్టెను గుర్తించిన ఓ డాక్టర్‌ వాట్సాప్‌ ద్వారా తమకు సమాచారం అందించడంతో అప్రమత్తమై.. దాన్ని తయారుచేస్తున్న ముఠాను గుర్తించామన్నారు.


Updated Date - 2020-07-20T07:03:29+05:30 IST