డబ్బు కోసం నా బిడ్డల్ని కూడా చంపుతానన్నాడు: దూబే సోదరి

ABN , First Publish Date - 2020-07-09T04:05:44+05:30 IST

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే గురించి అతని సోదరి చంద్రకాంత తివారీ కొన్ని ఘోరమైన నిజాలు చెప్పింది.

డబ్బు కోసం నా బిడ్డల్ని కూడా చంపుతానన్నాడు: దూబే సోదరి

కాన్పూర్: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే గురించి అతని సోదరి చంద్రకాంత తివారీ కొన్ని ఘోరమైన నిజాలు చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దూబేను అరెస్టు చేయడానికి వెళ్లిన ఎనిమిది మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి దూబే తప్పించుకు తిరుగుతున్నాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో దూబే సోదరి చంద్రకాంత తివారీ మాట్లాడుతూ.. ‘దూబే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టేవాడు. డబ్బు కోసం మమ్మల్ని చంపేస్తాననేవాడు. నా భర్తను కొట్టి, డబ్బులివ్వకపోతే మా పిల్లల్ని చంపేస్తానని బెదిరించేవాడు’ అని చెప్పింది.

Updated Date - 2020-07-09T04:05:44+05:30 IST