ఎయిర్ ఇండియా విమానాలకు దుబాయ్ ‘నో’...

ABN , First Publish Date - 2020-09-18T21:54:04+05:30 IST

ఏ) సిగ్నల్ నిలిపివేసింది. రెండు వారాలపాటు ఇండియా విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించింది.

ఎయిర్ ఇండియా విమానాలకు దుబాయ్ ‘నో’...

ముంబై : ఎయిర్ ఇండియా విమానాలకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(డీసీఏఏ) సిగ్నల్ నిలిపివేసింది. రెండు వారాలపాటు ఇండియా విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించింది. 


రెండు వారాలపాటు ఇండియా విమానాల రాకపోకలపై ఈ నిషేధం అమల్లో ఉంటుంది. గత రెండు వారాల్లో... కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్లతో ప్రయాణికులను రెండుసార్లు తీసుకువచ్చినట్లు దుబాయ్ ఎయిర్ ఫోర్టు అథారిటీ ఈ సందర్భంగా వెల్లడించింది. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను అక్టోబరు 2 వతేదీ వరకు నిలిపివేస్తున్నట్లు దుబాయ్ ప్రభుత్వ సీనియర్ అధికారులు శుక్రవారం చెప్పారు.


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిబంధనల ప్రకారం... భారతదేశం నుంచి ప్రయాణించే ప్రతీ ప్రయాణికుడు కొవిడ్ టెస్టు రిపోర్టు సమర్పించాలని కోరింది. తన ప్రయాణానికి 96 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకొని కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని స్పష్టం చేసింది. కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ ఉన్న ఓ ప్రయాణికుడు సెప్టెంబరు 4 వ తేదీన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో జైపూర్ నుంచి దుబాయ్ విమానంలో ప్రయాణించారు.


అంతకు ముందు దుబాయ్ విమానాల్లో ఇలాంటి ఘటన జరిగింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణికులను చేరవేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది. దీంతో సెప్టెంబరు 18 వతేదీ నుంచి అక్టోబరు 2 వతేదీ వరకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2020-09-18T21:54:04+05:30 IST