కడుపు నొప్పితో ఆస్పత్రికి మందుబాబు.. ఎక్స్‌రే చూసి షాక్ అయిన డాక్టర్లు..!

ABN , First Publish Date - 2020-05-31T01:41:25+05:30 IST

పురీషనాళంలో నొప్పిగా ఉందంటూ ఆస్పత్రికి వచ్చిన వ్యక్తికి పరీక్షలు చేయించిన డాక్టర్లు అతడి..

కడుపు నొప్పితో ఆస్పత్రికి మందుబాబు.. ఎక్స్‌రే చూసి షాక్ అయిన డాక్టర్లు..!

చెన్నై: కడుపులో నొప్పిగా ఉందంటూ ఆస్పత్రికి వచ్చిన వ్యక్తికి పరీక్షలు చేయించిన డాక్టర్లు అతడి ఎక్స్‌రే  చూసి నివ్వెరపోయారు. మద్యం మత్తులో ఓ వ్యక్తి 250 మి.లీ. గ్లాస్ సీసాను తన కింది భాగంలో నుంచి పురీషనాళంలోకి ఎక్కించుకోవడంతో అది చివరికి పెద్దపేగులోకి వెళ్లిపోయింది. రెండ్రోజుల పాటు ఇంట్లో ఎవరితో చెప్పకుండా నరక యాతన అనుభవించిన అతడు.. చివరికి డాక్టర్లను సంప్రదించి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ నెల 27న తమిళనాడులోని నాగపట్టినం ప్రభుత్వాసుపత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనిపై ఆస్పత్రి జనరల్ సర్జన్ డాక్టర్ ఎస్ పాండియరాజ్ మాట్లాడుతూ..‘‘ఎక్స్‌రే చూసి మేము షాక్ అయ్యాం. నా కెరీర్ మొత్తంలో ఇంత వరకు ఇలాంటి కేసు చూడలేదు..’’ అని పేర్కొన్నారు.


వాస్తవానికి ఇప్పుడు కరోనా వైరస్ పరీక్షలు చేయకుండా సర్జరీ చేయడంలేదనీ.. కానీ అతడి బాధ చూసి వెంటనే ఆపరేషన్ చేసి సీసా బయటికి తీశామని పాండియరాజ్ తెలిపారు. గాజు సీసా పగిలి ఉంటే అతడి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదన్నారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఈ నెల 14 నుంచి తమిళనాడులో మద్యం అమ్మకాలు కొనసాగుతున్న తెలిసిందే. మద్రాస్ హైకోర్టు మద్యం అమ్మకాలను నిలిపివేసినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అనుమతులు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సామాజిక దూరం నిబంధనతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 

Updated Date - 2020-05-31T01:41:25+05:30 IST