అంతా సవ్యంగా ఉంటే 6 నెలల్లో కరోనాకు ఔషధం: సిప్లా

ABN , First Publish Date - 2020-03-21T17:47:21+05:30 IST

ఆరోగ్య సమస్యల్లో ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఫ్లూలకు ఉత్తమమైన ఔషధాలను అందించే ప్రముఖ కంపెనీ సిప్లా రాబోయే 6 నెలల్లో కరోనా వైరస్ నివారణకు ఔషధాన్ని రూపొందించనున్నట్లు తెలిపింది. ఇదేగానీ సాధ్యమైతే భారత్‌లో...

అంతా సవ్యంగా ఉంటే 6 నెలల్లో కరోనాకు ఔషధం: సిప్లా

ముంబై: ఆరోగ్య సమస్యల్లో ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఫ్లూలకు ఉత్తమమైన ఔషధాలను అందించే ప్రముఖ కంపెనీ సిప్లా రాబోయే 6 నెలల్లో కరోనా వైరస్ నివారణకు ఔషధాన్ని రూపొందించనున్నట్లు తెలిపింది. ఇదేగానీ సాధ్యమైతే భారత్‌లో కరోనా నివారణకు తొలుత ఔషధాన్ని రూపొందించిన కంపెనీగా సిప్లా నిలవనుంది. ఇందుకోసం ప్రభుత్వ వైద్య పరిశోధనాలయాలతో  సిప్లా భాగస్వామ్యం ఏర్పరుచుకోనుంది. ఈ సందర్భంగా సిప్లా ప్రమోటర్ యూసుఫ్ హమిద్ మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం పనిచేయడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం. సిప్లా కంపెనీ ఇప్పటికే స్విట్జర్లాండ్‌కు చెందిన రోచేజ్‌ రూపొందించిన యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ యాక్టెమ్రాను భారత్‌లో పంపిణీ చేసింది, ఇది తీవ్రమైన ఊపితిత్తుల సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ఔషధం కరోనా విషయంలో సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపితమయ్యిందన్నారు. ప్రస్తుతానికి కోవిడ్ -19కు తగిన చికిత్స లేదు. దీనికి హెచ్‌ఐవి, యాంటీ వైరల్, యాంటీ మలేరియల్ ఔషధాలతో చికిత్స చేస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 10 వేలకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-03-21T17:47:21+05:30 IST