జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్ ప్రత్యక్షం

ABN , First Publish Date - 2020-12-10T14:24:48+05:30 IST

జమ్మూకశ్మీర్ లోని రణబీర్ సింగ్ పురా సెక్టారు అంతర్జాతీయ సరిహద్దుల్లో బుధవారం రాత్రి ఓ డ్రోన్ సంచరించింది....

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్ ప్రత్యక్షం

జమ్మూ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ లోని రణబీర్ సింగ్ పురా సెక్టారు అంతర్జాతీయ సరిహద్దుల్లో బుధవారం రాత్రి ఓ డ్రోన్ సంచరించింది. దేశ సరిహద్దుల్లో ఎగురుతున్న డ్రోన్ పై  బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు జవాన్లు కాల్పులు జరిపారు. పాకిస్థాన్ దేశం వైపు నుంచి ఈ డ్రోన్ వచ్చిందని బీఎస్ఎఫ్ జవాన్లు చెప్పారు. గత నెలలో మందార్ సెక్టారులోని సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద డ్రోన్ సంచరించింది. సెప్టెంబరు నెలలో అంతర్జాతీయ సరిహద్దుల్లోని సాంబా సెక్టారులో రెండు డ్రోన్లు తిరుగుతుండగా బీఎస్ఎఫ్ జవాన్లు దాన్ని గుర్తించారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ నుంచి డ్రోన్లు సంచరిస్తున్నాయని దీంతో బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. 

Updated Date - 2020-12-10T14:24:48+05:30 IST