రష్యా, ఉత్తర కొరియాల్లో కరోనా ఎందుకు లేదు?

ABN , First Publish Date - 2020-03-24T10:22:26+05:30 IST

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ రష్యా, ఉత్తర కొరియాల్లో ఎందుకు వ్యాపించలేదు? కరోనాకు కేంద్రమైన చైనాలోని వూహాన్‌ మినహా.. ఇతర నగరాల్లో...

రష్యా, ఉత్తర కొరియాల్లో కరోనా ఎందుకు లేదు?

  • అవి చైనాకు బలమైన మిత్రదేశాలు
  • డ్రాగన్‌ లక్ష్యం అమెరికా ఆర్థిక వ్యవస్థే
  • ప్రపంచ దేశాల స్టాక్‌ మార్కెట్లు విలవిల
  • చైనా స్టాక్‌ మార్కెట్లు మాత్రమే లాభాల్లో


వాషింగ్టన్‌, మార్చి 23: ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ రష్యా, ఉత్తర కొరియాల్లో ఎందుకు వ్యాపించలేదు? కరోనాకు కేంద్రమైన చైనాలోని వూహాన్‌ మినహా.. ఇతర నగరాల్లో ఆ వైరస్‌ ఎందుకు లేదు? ఇతర దేశాల్లో తన ప్రతాపాన్ని చూపుతూ.. ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌మార్కెట్లను కరోనా అతలాకుతలం చేస్తున్నా.. వూహాన్‌లో మాత్రం రికవరీలు అంతవేగంగా ఎలా సాధ్యమయ్యాయి? దీనికి విశ్లేషకులు చెబుతున్న సమాధానం ఒక్కటే..! కరోనా వైరస్‌ చైనా సృష్టే.  అంతకంటే ముందే ఆ దేశం వైర్‌సకు విరుగుడు(యాంటీ డోట్‌)ను కనుగొంది. తనకు బలమైన మిత్ర దేశాలు రష్యా, ఉత్తర కొరియాలకు ముందే యాంటీడోట్‌ అందజేసింది. అందుకే.. ఆ రెండు దేశాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వలేదు. ఆర్థికంగా బలమైన దేశంగా ఎదగాలనుకునే చైనాకు ముందున్న పెద్ద ప్రత్యర్థి అమెరికానే.


అమెరికాను ప్రత్యక్షంగా ఎదుర్కోలేకే.. వైర్‌సతో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఈ డ్రాగన్‌ వికృత ఆటలో.. ఇతర దేశాలు బలయ్యాయి. ముందుగానే విరుగుడు మందు ఉన్నందునే.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వూహాన్‌లో పర్యటించినప్పుడు ఒక్క మాస్కు మినహా.. ప్రొటెక్టివ్‌ గౌన్లు, గ్లౌవ్స్‌ ధరించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైరస్‌ డ్రాగన్‌ సృష్టే అనే అనుమానాలు నిజమైతే.. నెలలోగా కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలాక.. కరోనా విరుగుడును కనిపెట్టామని చైనా ప్రకటిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లోని స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి పడిపోయి విలవిలలాడుతుండగా.. ఒక్క చైనా స్టాక్‌ మార్కెట్లు మాత్రమే లాభాలను నమోదు చేస్తున్నాయి.

Read more